TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహబూబ్ నగర్ లో ధన ప్రవాహం

Published on: Sat Mar 3, 2012 10:20AM

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో త్వరలో ఉప ఎన్నికలు జరుగబోతున్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ఖర్చులకు, ఓటర్లను ప్రభావితం చేయడానికి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, తెరాసలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే రాష్ట్ర రాజధాని ఇతర ప్రాంతాలనుంచి కోట్లాది రూపాయలు తరలించినట్లు తెలిసింది. దీంతో నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటికే  దాదాపు కోటిన్నర రూపాయల నగదు దొరికింది. ప్రస్తుతం జిల్లాలో నగదు ప్రవాహాన్ని నిరోధించేందుకు 43 చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. వీటిలో 35 చెక్ పోస్టులు ఉప ఎన్నికలు జరుగుతున్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో, మరో ఏడు జిల్లాల సరిహద్దుల్లో, మరొకటి దేవరకద్రలో ఏర్పాటుచేశారు. ఒక్కో చెక్ పోస్టులో ఒక ఎస్పై, నలుగురు కానిస్టేబుళ్ళు, 8 గంటల చొప్పున 24 గంటలు తనిఖీ చేస్తున్నారు. అయితే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడానికి చాలా ముందే కోట్లాది రూపాయలు ఆయా నియోజకవర్గాల ప్రజలకు చేరుతుందని తెలిసింది.