TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొల్లాపూర్ కుర్చీ వెలమదొరలదే

Published on: Tue Feb 21, 2012 10:07AM

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 13 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో జూపల్లి కృష్ణారావు, కొత్త వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా వెలమదొరలే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఈ స్థానాన్ని వెలమలకే కేటాయిస్తూ వచ్చాయి. ఈసారి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, జగన్మోహనరావు, మార్కెట్ యార్డ్ కమిటి అధ్యక్షులు హెచ్.వీరయ్య,డి.నారాయణ పోటీపడుతున్నారు. టిడిపి నుంచి సి.ఆర్.జగదీశ్వరరావు బరిలో ఉన్నారు. అదే పార్టీనుంచి పగిడాల శ్రీనివాస్ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 99,161 మంది పురుష ఓటర్లు, 96,226 మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 70శాతం బిసి ఓటర్లు ఉన్నప్పటికీ ఇక్కడ వెలమ, రెడ్డిలదే ఆధిపత్యం.