TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహబూబ్ నగర్ జిల్లాలో అడుగుపెట్టనున్న జగన్

Published on: Wed Jan 18, 2012 9:43AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రైతు దీక్ష విజయవంతం కావడంతో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లాలో మూడో విడత ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేయాలని మొదట ఆలోచన చేసినప్పటికీ దానికి ముందు ఓదార్పు యాత్రను చేపట్టి తనకు లభించే ప్రజాదరణను చూసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఈ నెల 21వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో అడుగు పెడుతున్నారు. తెలంగాణ సెంటిమెంటు తక్కువగా ఉండడంతో కొత్తూరు జహంగీర్ పీర్ దర్గాను ఆయన సందర్శించనున్నట్లు చెబుతున్నారు.