వైభవంగా టివి నంది అవార్డులు
Published on: Sun Jan 8, 2012 9:54AM
మహ
బూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌లోని స్టేడియం గ్రౌండ్‌లో టివి నంది అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో టివి నంది ఆవార్డుల బహుమతుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 2009 - 2010కి గాను 70 మందికి, 2010-2011కు గాను 60 మందికి నంది బహుమతులు అందజేశారు. బహుమతులతోపాటు 30 మందికి జ్యూరీ అవార్డులు అందజేశారు.
రాష్ట్ర రాజధానిలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి అందరి సమక్షంలోనే అందజేయాలని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటుచేసినట్లు మంత్రి చెప్పారు. ప్రతి ఏడాది జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖమంత్రి డికె అరుణ తెలిపారు. ఈ కార్యక్రమానికి టివి నటులు, సినిమా కళాకారుల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి.
తొలి ఉత్తమ టివి డాక్యుమెంటరీ - 2010 ‘మార్గదర్శికి, బంగారు నంది, మార్గదర్శి దర్శకుడు నటరాజ్ సుందర్‌కు కాంస్య నంది అవార్డు, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - 2010, అన్నదాతకు రజత, కాంస్య నంది బహుమతి, తొలి ఉత్తమ టీవీ మెగా సీరియల్-2010 పంచతంత్ర సీరియల్‌కు బంగారు నంది, పంచతంత్ర దర్శకుడు సంజీత్ ఘోష్‌కు కాంస్య నంది అవార్డులు అందజేశారు.


