TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయిష్టంగానే రంగంలోకి దిగుతున్న పార్వతమ్మ!

Published on: Thu May 3, 2012 10:07AM

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్నా ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మాగుంట కుటుంబమే దిక్కయ్యింది. పార్టీ అధిష్టానం ఒత్తిడితో మాజీ ఎంపి పార్వతమ్మ అయిష్టంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధపడుతున్నారు. నిజానికి ఆమె ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ తరపున సరైన అభ్యర్థి రంగంలో లేకపోవటంతో పార్టీ అధిష్టానం ఆమెను బలవంతంగా ఒప్పించి బరిలోకి దింపింది. ఒకవైపు పార్వతమ్మ ఆరోగ్యం సరిగా లేదు, మరో వైపు జిల్లాలోని పార్టీ నాయకుల వైఖరి పట్ల మాగుంట కుటుంబం అసంతృప్తితో ఉంది. 1998 నుంచి 2004 వరకూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం తమ కుటుంబం అనేక త్యాగాలు చేస్తే 2004 తరువాత పూచికపుల్లను తీసేసినట్లు తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అవసరాలకు మాత్రమే తమ కుటుంబసబ్యులను వినియోగించుకుని అవసరం తీరిన తరువాత గాలికి వదిలేస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయటం తనకేమాత్రం ఇష్టం లేదనీ, అయితే కార్యకర్తలు కొందరు శాసనసభ్యుల అభ్యర్థన మేరకే రంగంలోకి దిగానని పార్వతమ్మ అంటున్నారు.