TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూబ్లీ ఉప ఎన్నికల బరిలో 34 మంది అభ్యర్థులు

Published on: Wed Oct 22, 2025 9:08PM

 

జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ ల స్క్రూటీనీ ప్రక్రియను బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో  సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పకడ్బందీగా  నామినేషన్ ల స్క్రూటీనీ చేపట్టాలనీ రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. భారీ స్థాయిలో నామినేషన్ లు దాఖలు కావడంతో నామినేషన్ల స్క్రూటీనీ అధిక సమయం పడుతుంది. అభ్యర్థులు తమ  నామినేషన్ ల ఉపసంహారణకు ఈ నెల 24  తేదీ వరకు ఈసీఐ అవకాశం ఇచ్చింది.

 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. చాలా నామినేషన్లు వచ్చినప్పటికీ.. పోటీ ఇ రెండు పార్టీల మధ్యనే ఉండటంతో వీరి నామినేషన్ల పరిశీలపై ఉత్కంఠతగా ఎదురు చూసారు కార్యకర్తలు. తన నామినేషన్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ యాదవ్ తెలిపార. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు తెలిపారు. 56 నామినేషన్లును ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బరిలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదం తెలిపారు.