TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రేకింగ్ న్యూస్‌.. మాగంటి బాబు కుమారుడు మృతి..

Published on: Tue Jun 1, 2021 10:27PM

మాగంటి ఇంట మ‌రో విషాదం. మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు. హైద‌రాబాద్‌లోని పార్క్‌ హయత్‌ ప్లాజాలో రవీంద్రనాథ్ అచేత‌నంగా ప‌డి ఉన్నాడు. ఆయ‌న్ను వెంట‌నే అపోలో ఆస్పత్రికి త‌ర‌లించ‌గా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. మృతికి కార‌ణాలు తెలియాల్సి ఉంది.  

కొన్ని రోజుల క్రితం మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మ‌ర‌ణించ‌గా.. ఇప్పుడు ఆయ‌న రెండో కుమారుడు సైతం చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది.