TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పదేళ్లుగా రంగురాళ్ళ తవ్వకాలు ... పట్టించుకోని ప్రభుత్వం?

Published on: Sat Apr 28, 2012 9:57AM

ఆంధ్రప్రదేశ్ మాఫీయాలు, సిండికేట్లకు నిలయంగా మారింది. విశాఖజిల్లా కూడా ఇటువంటి మాఫియాకు కొలువైంది. విశాఖజిల్లా మన్యంలోని పాడేరు, చింతపల్లి, అరుకులోయ, గొలుగొండ మండలాల్లో పదేళ్ళనుంచి అక్రమంగా రంగురాళ్ళ తవ్వకాలు జరుగుతున్నాయి. రాజకీయనాయకుల అండదండలు, అధికారుల సహాయసహకారాలతో ఈ ప్రాంతంలో విచ్చిలవిడిగా విలువైన రంగురాళ్ళను దోచు కుంటున్నారు. వ్యాపారులతో పాటు వారికి సహాయసహకారా లందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కోట్లకు పడగలెత్తు తున్నారు. ఇది ఎంతో లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ఇతర వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ రంగురాళ్ళ తవ్వకం ప్రారంభించారు. ఎటువంటి అనుమతులు లేకుండా వీరు తవ్వకాలు నిర్వహిస్తున్నారు.

 

 

 

 

అటవీ, పోలీస్, రెవెన్యూ, భూగర్భగనుల శాఖల అధికారులు అప్పుడప్పుడు కంటితుడుపు చర్యగా దాడులు చేస్తున్నారు. తప్ప తవ్వకాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవటం లేదు. గతపదేళ్ళుగా ఈ అక్రమ తవ్వకాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపడి సుమారు 120మంది మరణించారని అధికారగణాంకాలు చెబుతున్నాయి. కానీ, మృతుల సంఖ ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. కూలీలు క్వారీల్లో తవ్వకాలు జరిపి తీసుకువచ్చిన రంగురాళ్ళకు వ్యాపారులు చాలా తక్కువ ధర చెల్లిస్తున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి వీటిని నర్సీపత్నానికి చెందిన ప్రధాన రంగురాళ్ళ వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో లభించే రంగురాళ్ళకు అంతర్జాతీయ మార్కెట్టులో మంచి డిమాండు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారులు, రాజకీయనాయకులు, అధికారులు సిండికేటుగా ఏర్పడి విశాఖమన్యంలోని విలువైన సంపదను దోపిడీ చేస్తున్నారు