TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేవుడికి సమన్లు.. ఇదెక్కడి న్యాయం?

Published on: Sat Jan 8, 2022 1:00PM

చట్టం ముందు అందరూ సమానమే కదా ... దేవుడైనా, దేవుని విగ్రహమే అయినా అంతే కదా అనుకున్నారో ఏమో కానీ, ఆ జడ్జిగారు ఆలయ మూలవిరాట్టు విగ్రహాన్ని కోర్టులో హాజరు పరచాలని సమన్లు జారీ చేశారు. వినడానికి కొంచెం వింతగా ఉన్న ఈ విచిత్ర ఉదంతం మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరిగింది. అదే మన ఏపీలో జరిగుంటే ఏమి జరిగేదో వేరే చెప్పనక్కరలేదు. విగ్రహాన్ని ముక్కలు చేసి మరీ కోర్టు ఎదుట పడేసేవారు కావచ్చు,మన ప్రభువులు. కానీ,తమిళనాడులో ఇంకా ధర్మం అంతో ఇంతో బతికుంది కావచ్చు, అందుకే  తిరుప్పూరు జిల్లాలోని ఓ ఆలయ మూలవిరాట్టును హాజరుపరచాలంటూ దిగువ కోర్టు సమన్లు జారీచేసిన ఉదంతం పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడికే సమన్లు జారీ చేయడం ఏంటని క్రింది కోర్టు న్యాయాధికారిని  ప్రశ్నించింది. 

ఇక విషయంలోకి వెళితే, తిరుప్పూరు జిల్లా శివిరిపాళయం పరమశివన్‌ ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహాన్ని  గతంలో దొంగలు ఎత్తుకెళ్ళారు. అయితే,  పోలీసులు ఆ విగ్రహం ఆచూకీని కనుగొని దానిని ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా ఆ విగ్రహాన్ని గర్భాలయంలో పునః ప్రతిష్ఠిచేశారు.కుంభాభిషేకం నిర్వహించారు. నిత్య పూజలు ఇతర ఆచార క్రతువులు జరుగుతున్నాయి. అయితే,  విగ్రహాల చోరీకేసులపై విచారణ జరుపుతున్న కుంభకోణం ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఆ ‘మూల విరాట్టు’ను జనవరి  6వ తేదీన తమ ఎదుట హాజరుపరచాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సమన్లను సవాల్‌ చేస్తూ ఆలయ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.  చోరీకి గురైన ఆ విగ్రహాన్ని ఆగమ నియమాల ప్రకారం ఆలయంలో ప్రతిష్ఠించి సంప్రోక్షణలు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కుంభకోణం కోర్టు సమన్లు జారీ చేయడంపై హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌.సురే్‌షకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఓ అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా  మూలవిరాట్టును పరిశీలించవచ్చని,అంతే కానీ, మూలవిరాట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భాలయం నుంచి బయటికి తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. అది తమిళనాడు కాబట్టి దేవుడు బతికి పోయాడు.. అదే మన ఏపీలో అయితే..