అలా వచ్చింది... చంద్రబాబుపై కామెంట్లు చేసేసింది..

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానమని.. ఎంతో ప్రేమ అని చెప్పిన మాధవీ లత అందరికీ షాకిస్తూ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె బేజీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక మాధవీలత చేసిన పనికి అందరూ షాకై..అదేంటీ పవన్ అంటే అభిమానమని చెప్పింది.. ఆయన అవకాశమిస్తే పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయడానికి కూడా రెడీ అని చెప్పిన ఆమె ఇంత సడన్ గా బీజేపీలో చేరిపోయిందేంటీ అని అనుకుంటుండగా...ఇక ఆ వార్తలపై స్పందించిన మాధవీ లత..తనకు పవన్ అంటే ఇప్పటికీ అభిమానం ఉందని... కానీ బీజేపీ పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరానని చెప్పుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి తాను అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని.. మరీ ముఖ్యంగా తనకు ఏపీ, తెలంగాణల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పని చేయాలనే కోరిక ఉందన్నారు. అంతేకాదు పోటీ గురించి మాట్లాడిన ఆమె.. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని.. అవకాశం వస్తే తప్పకుండా బరిలోకి దిగుతానని మాధవీ తన మనసులోని మాటను చెప్పారు.

 

ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... అలా బీజేపీలో చేరిందో లేదో అప్పుడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కామెంట్లు స్టార్ట్ చేసింది. ఓ చానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు మాట మార్చారు...ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ ఎత్తున నిధులు ఇచ్చింది...కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదా?. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది... లారీ ఇసుక ఎత్తితే రూ. 5 లక్షలు బిల్లు పెట్టారు" అని ఆరోపించింది. దీంతో మాధవీ లత చేసిన వ్యాఖ్యలకు  బీజేపీ నేతలు షాకయ్యారట. నిన్న కాక మొన్నొచ్చిన మాధవీ లతే మనకంటే ఎంతో బెటరని మాట్లాడుకుంటున్నారట. మరి వచ్చీ రాగానే చంద్రబాబునే టార్గెట్ చేసింది.. మరి చంద్రబాబు మీద ఒక్క మాట కూడా పడనివ్వని.. ఆ పార్టీ నేతలు మాధవీ లతకు ఎలా కౌంటర్ ఇస్తారో చూద్దాం..