TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ నగ్న వీడియో కాల్ ఒరిజనలే!

Published on: Sat Aug 13, 2022 4:11PM

ఎన్ని డ్రామాలాడినా, ఏకంగా ఎస్పీ చేతే ఆ వీడియోను ఫొరెన్సీక్ పరీక్ష కూడా ఒరిజనలో కాదో తేల్చలేదని చెప్పించినా, ఆ ఎస్పీ చెప్పిన దానిని పట్టుకుని గోరంట్ల మాధవ్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నా.. దానిని పట్టుకుని మంత్రి రోజా వంటి వారు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించేసినా నిజం మాత్రం నిప్పులా బయటపడింది.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనలేనని అమెకిరా ఫోరెనసిక్ ధృవీకరించింది. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకుడు పట్టాభి విలేకరుల సమావేశంలో చెప్పారు. అమెరికా ఫోరెన్సిక్ మాధవ్ పోర్న్ వీడియో కాల్ వీడియో ఒరిజనలేనని ధృవీకరిస్తూ ఇచ్చిన నివేదికను బయట పెట్టారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవడానికి ఈ ఆధారం సరిపోతుందా జగన్ రెడ్డీ అని ప్రశ్నించారు.  

అసలు ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే గోరంట్ల మాధవ్ కు క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిలదీసారు. అమెరికా ఫోరెన్సిక్ నివేదికే సాక్ష్యం గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వీడియో ఒరిజనలేననడానికి అని పట్టాభి అన్నారు. ఈ నివేదిక చాలు గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడి కావడానికి అని పేర్కొన్నారు. వైసీపీ సర్కార్ పోలీసులను అడ్డం పెట్టుకుని తమ ఎంపీని కాపాడడానికి చూస్తోందని, అందుకే అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ లో వీడియో టెస్ట్ చేయించి నివేదిక బయటపెడుతున్నానని పట్టాభి అన్నారు.

గోరంట్ల వీడియో ఒరిజనల్ అని తేలితే చర్యలు తీసుకుంటానని మీడియా ముఖంగా చెప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి ఛండాలపు పని చేసిన మాధవ్ సిగ్గూ ఎగ్గూ లేకుండా అనంతపురంలో హోర్డింగ్ లు ఎలా పెట్టించుకుంటారని పట్టాభి అన్నారు.