TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు

Published on: Wed Jan 11, 2012 10:18AM

వడ్డెపల్లి : ఫిబ్రవరి 8నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న మేడారం జాతర ఏర్పాట్లపై సెక్టోరల్ అధికారులతో కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్‌పీ రాజేశ్‌కుమార్ సమీక్ష జరిపారు. జిల్లా పరిషత్ హాల్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సినజాగ్రత్తలు, సెక్టోరల్ బృందాలకు కేటాయించిన విధులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు జాతర ప్రాంగణాన్ని 38 సెక్టార్లుగా విభజించి వివిధ ప్రాం తాలలో సెక్టోరల్ బృందాలు ఏర్పాటు చేసి సెక్టార్ ఇన్‌చార్జిగా జిల్లా అధికారులను నియమించడం జరిగిందన్నారు. అధికారులు సమన్వయంతో భాగస్వాములై భక్తులకు సేవలందించేందుకు తమవంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.

జాతరలో 40 సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా భక్తు ల సౌకర్యాలను పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ నెల 12న మేడారంలో అధికారులు పర్యటించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల ని కలెక్టర్ ఆదేశించారు. జాతరలో ప్రధానంగా పారిశుధ్యం, తాగునీరు, రవాణా సౌకర్యాలు, విద్యుదీకరణపై ప్రధాన దృష్టి సారించాలన్నారు. తమ సెక్టార్లలో ప్రధాన సదుపాయాలు అం దుబాటులో ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జాతర ఏర్పాట్లపై పూర్తిగా అవగాహన కల్పించుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించి జాతర విజయవంతానికి ప్రతీ అధికారి కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా కోరారు.

ఎస్‌పీ రాజేశ్‌కుమార్ మాట్లాడుతూ జాతర విజయవంతానికి పోలీసులు, ఇతరశాఖల అధికారులు సమన్వయం తో కృషి చేసి విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుం డా 8వేల మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గత జాతర కంటే ఎక్కువ మొత్తంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు. 8మంది ఏఎస్‌పీలు, 45 మంది డీఎస్‌పీలు, 140 మంది సీఐలు, 448 మంది ఎస్ఐలు, 18 మహిళా ఎస్ఐలు, 495 హెడ్ కానిస్టేబుళ్లు, 3100 కానిస్టేబుళ్లు, వెయ్యి మంది హోంగార్డులను నియమించామన్నారు. అనంతరం గత జాతరలో పని చేసిన అధికారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పునరావృతం కాకుండా తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.