TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాదాపూర్ మైహోం గణేషుడి లడ్డూ రూ.29 లక్షలు

Published on: Mon Sep 16, 2024 12:00PM

గణేష్ ఉత్సవాలను వేడుకగా నిర్వహించిన అనంతరం గణేషుడి లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. కమ్యూనిటీలలోనూ, వీధులలోనూ, వాడవాడలా గణేష మంటపాలు ఏర్పాటు చేసి గణేష్ చతుర్ది నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తరువాత గణేష నిమజ్జనం జరుగుతుంది. ఆ నిమజ్జనానికి ముందు మండపాలలో గణేషుని లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీ.

ఇప్పటి వరకూ గణేష్ లడ్డూ వేలం విషయంలో బాలాపూర్ గణేషుడు బాగా పాపులర్. బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం ధర ఏటికేడు పెరుగుతూ వస్తోంది. ఒక్క జంట నగరాల జనమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలూ కూడా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో ఎంత ధరకు వెళ్లిందన్న విషయంపై ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా మాదాపూర్ మైహోంలో ఏర్పాటు చేసిన గణేష్ మంటపంలో లడ్డూ వేలంలో  ఇప్పటివరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లడ్డూగా.. బాలాపూర్ గణేషుని లడ్డూ మాత్రమే ఉండేది. కాగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు  

మాదాపూర్ మైహోమ్ భుజాలో గణేషుని లడ్డూకు నిర్వహించిన వేలానికి విశేష స్పందన లభించింది. హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూ రూ.29లక్షలు పలికింది. దీంతో బాలాపూర్ గణేషుడిని మించి అత్యంత ఖరీదైన లడ్డూగా మైహోం భుజా అపార్ట్ మెంట్స్ గణేషుడు కొత్త రికార్డు సృష్టించారు.