TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలిక మిస్సింగ్....ఇంటి పైన మృతదేహం

Published on: Wed Oct 1, 2025 7:31PM

 

 

నిన్నటి నుండి కూతురు కనిపిం చకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు...  కూతురు తిరిగి వస్తుందని ఆశపడ్డ తల్లిదండ్రులకు విషాదం ఎదుర య్యింది... పాప మృతదేహాన్ని చూసి రోదిస్తున్నతల్లిదండ్రు లను చూసిన స్థాని కులు సైతం కంట తడి పెట్టుకున్నారు. మాదన్నపేటలో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ అజీమ్, షబానా బేగం దంపతులు... వీరికి హుమేయని సమ్మయ్య (07) అనే ఒక్క కూతురు ఉంది.. వీరు కంచన్ బాగ్ లోని ఓవైసీ హాస్పిటల్ వద్ద నివాసం ఉంటున్నారు. అయితే  మాదన్న పేట్ లోని చావనీలో నివాసం ఉంటున్న అమ్మమ్మ ఇంటికి బాలిక తన తల్లి షబానా బేగంతో కలిసి వచ్చింది.

 అమ్మమ్మ ఇంటి వద్ద బయట ఆడుకోవడానికి వెళ్లిన బాలిక నిన్నటి నుండి మిస్సింగ్ అయింది. బాలిక కనిపించక పోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులు మిస్సింగ్ అయిన పాప కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా... ఇటు సాయంత్రం సమయంలో ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకర్ లో ఉన్న పాప మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించ సాగారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంక్ లో ఉన్న పాప మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అసలు పాప వాటర్ ట్యాంక్ వద్దకు ఎందుకు వచ్చింది? వాటర్ ట్యాంక్ లో ఎలా పడిపోయింది. పాప ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ లో పడిపోయిందా? లేదా ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.