మదనపల్లి అక్కా చెల్లెళ్ళ హత్య ఘటనలో కుట్ర కోణం.. !
Published on: Thu Feb 4, 2021 9:20AM
మదనపల్లి లో జరిగిన అలేఖ్య, సాయి దివ్యల హత్య కేసు మిస్టరీలో మరో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు అలేఖ్య, సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఆకోఅంట్ల ఆధారంగా కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ హత్యలకు సంబంధించి కొత్త కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు తాజాగా బయటపడుతున్నాయి.
పురుషోత్తమ నాయుడు దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు హైకోర్టు న్యాయవాది రజని అయనను కలసి మాట్లాడారు. ఈ జంటహత్యల కేసులో నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె మీడియాకు తెలిపారు. మరోపక్క సుప్రీం కోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తం నాయుడును జైలులో కలసి మాట్లాడారు. ఈ హత్యలకు వారిని వేరే వ్యక్తులు ఖచ్చితంగా ప్రేరేపించి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు చిత్తూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని.. ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండవచ్చని ఆమె అనుమానిస్తున్నారు.


