TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘మా’ ఫలితాలు ఇప్పుడప్పుడే రావేమో

Published on: Tue Mar 31, 2015 11:56AM

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కోర్టు కనుసన్నల్లో జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల జరిగిన తీరును వీడియో రికార్డ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం నాడు ఈ కేసుకు సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం వుందని, ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం వుందని సినీ జీవులు భావించాయి. కానీ కోర్టు ఆదేశంతో ఏప్రిల్ 7వ తేదీ వరకు ‘మా’ విజేత ఎవరో తేలే అవకాశం లేకుండా పోయింది. ‘మా’ ఎన్నికల పోలింగ్‌ వీడియో సీడీలను ఏప్రిల్‌ ఏడో తేదీన కోర్టుకు సమర్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మరి ఏప్రిల్ 7వ తేదీన ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.