TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్వీ ప్రసాద్ నుంచి కొండాపూర్‌కి బస్ టికెట్ ఎంతో తెలుసా..?

Published on: Thu Jul 20, 2017 12:08PM

ఇదేం పిచ్చి ప్రశ్న ఎల్వీ ప్రసాద్ నుంచి కొండాపూర్‌కి‌ బస్ టికెట్ ఎంత ఉంటుంది మహా అయితే 14 రూపాయలు..కానీ రూ.674 రూపాయల టికెట్ తెగితే..టిక్కెట్ కొట్టిన కండక్టర్‌కి..తీసుకున్న ప్రయాణికురాలికి నోట మాట వస్తుందా..? ఇదంతా ఎక్కడ జరిగిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.. అవును మన హైదరాబాద్‌లోనే..తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టిమ్ యంత్రాల్లో తరచూ లోపాలు తలెత్తుతుండటంతో కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టిక్కెట్లలో ఒక్కోసారి వివరాలు ప్రింట్ కాకపోవడంతో తెల్ల కాగితాలు బయటకు వస్తున్నాయి..గ్రేటర్ రీజియన్ పరిధిలో ఉన్న 28 డిపోల్లో టీమ్‌లు సరిగా పనిచేయడం లేదంటూ రోజుకి 20 నుంచి 25 ఫిర్యాదులు వస్తున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు..టీమ్ మిషన్లు సరిగా పనిచేయకపోవడం కండక్టర్ల ఉద్యోగాలకే ఎసరు తెస్తోంది. వివరాలు ప్రింట్ కాకుండా టికెట్ బయటకు రావడంతో ఆ టిక్కెట్‌పై పెన్నుతో రాసిన కండక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. నిన్న ఎల్వీ ప్రసాద్ దగ్గర రూ.674 టికెట్ రావడం..దానిని ఇచ్చేలోపే సదరు ప్రయాణికురాలు తప్పుగా వచ్చిన టిక్కెట్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.