TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చార్జ్ అయిపోయింది... చౌరస్తాలోనే ఆగిపోయిన లగ్జరీ బెంజ్.!

Published on: Wed Jul 8, 2026 10:42AM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో మంగళవారం ఓ లగ్జరీ కారు నడిరోడ్డుపై నిలిచిపోయింది. పర్యావరణ పరిర క్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో చాలా మంది  ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. అయితే బ్యాటరీ ఛార్జ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనడానికి ఈ ఘటన  నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.  ఎలక్ట్రిక్ మెర్సిడెస్-బెంజ్ కారు బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కావడంతో నడి రోడ్డులో నిలిచిపోయి.. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు కారణమైంది. 

సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని.. వాహనాన్ని రోడ్డుపక్కకు తరలించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై  స్థానికులు, ప్రయాణికులు  లగ్జరీ కారు అయినా... ఛార్జ్ లేకపోతే ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదుగా అంటూ సెటైర్లువేసుకున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఇంధనం అయిపోవడంతో వాహనం నిలిచిపోవడంలాంటి పరిస్థితేనని, ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ స్థాయి ని ముందుగానే గమనించ డం  అవసరమని సూచిస్తున్నారు.

Ran out of charge, Electric vehicle, EV, Teluguone