TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగ్ర‌వాది ఫోటో రిలీజ్...

Published on: Wed Mar 8, 2017 3:32PM

 

ల‌క్నోలోని థాకుర్‌గంజ్‌లోని ఓ ఇంట్లో చొరబడి దాక్కున్న ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉగ్రవాది భోపాల్‌-ఉజ్జ‌యిని రైలులో పేలుడు ఘటనలో పాల్పడినట్టు తెలుస్తోంది. భోపాల్‌-ఉజ్జ‌యిని రైలు పేలుడు కోసం ఉగ్ర‌వాది పైప్ బాంబులు అమ‌ర్చిన‌ట్లు.. అమర్చిన ఫోటోల‌ను కూడా ఆ ఉగ్ర‌వాది సిరియాకు పోస్ట్ చేసిన‌ట్లు సీఎం చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఉగ్ర‌వాది ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. బోగీలో ఉన్న అప్ప‌ర్ బ‌ర్త్‌లో బాంబుల‌ను అమ‌ర్చ‌డం వ‌ల్ల న‌ష్టం పెద్ద‌గా జ‌ర‌గ‌లేద‌న్నారు. బాంబులు పేల‌గానే తిరిగి ల‌క్నో వెళ్లాల‌ని ఉగ్ర‌వాదులు ప్లాన్ వేసిన‌ట్లు సీఎం చౌహాన్ తెలిపారు.