TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సూపర్ జెయింట్స్ లక్నో జట్టు ఓనర్ అతి

Published on: Thu Apr 2, 2026 9:28AM

ఐపీఎల్ సీజన్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతోంది. జట్లన్నీ విజయం కోసం చెమటోడుస్తున్నాయి. గేమ్ అంటేనే గెలుపు ఓటములు. క్రీడాకారుల్లో ఆ స్ఫూర్తి ఉంటుంది కానీ జట్టు యజమానుల్లో మాత్రం అది కనిపించడం లేదు. గతంలో అంటే 2024 సీజన్ లో సన్ రైజర్స్ జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదురైన తరువాత లక్నో సూపర్ జెయింట్స్ అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆ జట్టు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం,  కెమేరాల ముందే రాహుల్ పై గట్టిగా అరవడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

అప్పట్లో  సంజీవ్ గోయెంకా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం తరువాత సంజీవ్ గొయెంకా మళ్లీ అదే సీన్ రిపీట్ చేశారు.  
మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే కెప్టెన్ రిషభ్ పంత్ తో తీవ్ర వాగ్వాదానికి దిగడం స్పష్టంగా కెమేరా కంటికి చిక్కింది. ఒకే సమయంలో జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, కెప్టెన్ రిషభ్ పంత్ తో గోయెంకా దురుసుగా మాట్లాడటం కనిపించింది.

 ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ గా మారాయి. దీంతో ఐపీఎల్ లో జట్టు యజమానుల తీరుపై మరో సారి చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంక వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా 2024 సీజన్ లో సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్ పట్ల వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ సంజీవ్ గోయెంకాను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. రెండు జట్లు ఆడితే గెలిచేది ఒక జట్టేనన్న విషయం గోయెంకా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.