బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

posted on: Jul 2, 2025 9:38AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రానున్న రెండు రోజులలో   దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా  వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...