హైదరాబాద్ మెట్రో లిఫ్టులో 'రత్తాలు రైస్ మిల్'

 

థియేటర్ లో కార్నర్ సీట్లు పాయె..పార్కులో పొదలు పాయె..మెట్రో లిఫ్ట్ వచ్చే... పార్కులు,థియేటర్ లు నిన్నా మొన్నటి వరకు ప్రేమికులకు అడ్డాగా నిలిచేవి. ప్రస్తుతం మెట్రో లిఫ్టులో రొమాన్స్ చేసేస్తున్నారు. దేశంలోనే ఢిల్లీ తర్వాత అత్యంత రెండో పొడవైన మెట్రో మార్గంగా హైదరాబాద్‌ మెట్రోకి స్థానం దక్కింది. హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ఇంజినీరింగ్ అద్భుతానికి ప్రతీకగా చెబుతుంటారు. అయితే, మెట్రో స్టేషన్‌లలో వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు ప్రేమికులకు అడ్డాగా మారుతున్నాయి. నాలుగు వైపులా కవర్ చేసి ఉండే ఈ లిఫ్టులు ప్రేమికులకు మంచి స్పాట్‌గా మారాయి. ఏకాంతం కోరుకునే ప్రేమికులు ఈ లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నాయన్న సంగతిని గుర్తించకుండా ఆ కాస్త సమయంలోనే ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇటీవల ఈ సీసీటీవీ దృశ్యాలను చూసిన మెట్రో సిబ్బంది షాక్ అయ్యారు. 
లిఫ్ట్ పైకి వెళ్లే ఆ కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుర్రకారు రెచ్చిపోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అనేక మెట్రో స్టేషన్లలోని లిఫ్టుల్లో ఇటీవల యువ జంటలు కామకలాపాలతో రెచ్చిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బయటకొచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మెట్రోలోని ప్రతి ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ప్రయాణికుల కదలికలను ఉప్పల్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. యువ జంటల కామ కలాపాలను గుర్తించిన మెట్రో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. స్టేషన్లలో ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో పద్ధతిగా ఉండాలంటూ సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియోలు మెట్రో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణ చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లిఫ్ట్‌లలో ఇలా పాడు పనులు చేస్తున్నవారంతా ఇంటర్, డిగ్రీ చదివే వారు కావడం గమనార్హం.