TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలేశునికీ తప్పని న(క)ష్టాలు?

Published on: Sat Aug 4, 2012 11:18AM

ప్రపంచంలో కుబేరులను సైతం మెప్పించగల భారతదేశ కలియుగ ప్రత్యక్షదైవం తిరుపతి వెంకటేశ్వరునికీ నష్టాలు తప్పటం లేదు. ఆయన మహిమాన్వితమైన ప్రసాదంగా పేరొందిన లడ్డు వల్ల ప్రతీఏటా రూ.130కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. అలానే ప్రతీ ఏటా భక్తుల ఉచిత ప్రసాదభారమూ టిటిడి మోస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీతో పాటు అదనపు సెక్యూరిటీ భారమూ టిటిడిపై పడుతోందంటున్నారు. ఇదే కాకుండా కొన్నిరకాల సేవల్లో ఖర్చుపెరిగిపోయినా భక్తులపై భారం మోపటం ఇష్టం లేక టిటిడినే ఖర్చు భరిస్తోందంటున్నా రు. అలానే ప్రత్యేకపరిశోధనలు, యాత్రికుల కోసం ప్రత్యేక సేవలకు టిటిడి అదనపు వసతులకు కూడా కొంత ఖర్చు చేస్తోంది. ప్రతీఏటా నూతనభవనాలను నిర్మించటం ద్వారా కొంత వరకూ టిటిడి లాభాలను ఆర్జిస్తోంది. వసతుల ద్వారా లభించే ఆదాయం వల్ల టిటిడి కొన్ని అదనపు సేవలను పెంచుకుంది. వేదం నేర్పే పాఠశాలలకు ప్రోత్సాహకం, థార్మిక కార్యక్రమాల నిర్వహణ భారం కూడా టిటిడిపైనే పడుతోంది.

 

 

కొన్ని జిల్లాల్లో టిటిడి నిర్మించిన కళ్యాణమండపాలకు స్థానికంగా విలువను ఇవ్వటం లేదు. దీని వల్ల అక్కడి సిబ్బంది వేతనాలు కూడా టిటిడికి అదనపుభారమవుతోంది. భారీస్థాయిలో ముద్రణఖర్చును టిటిడి భరించి అతితక్కువ ధరకు పుస్తకాలు అమ్ముతున్నందున వచ్చే నష్టాలు గురించి ఎవరూ తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదని ఇఓ ఎల్వీసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఒక్క లాభాలు, ఆదాయాల గురించే అందరూ మాట్లాడుకోవటం లోకసహజం. భక్తులందరూ ఈ వెంకన్నకు మొక్కితే ఆయన మోస్తున్న అదనపు భారం గురించి ఎవరికి చెప్పుకోవాలి?