లాస్ ఏంజెల్స్ ఇన్ ఫ్లేమ్స్.. కార్చిచ్చుతో కాలిపోతున్న నగరం!
Published on: Thu Jan 9, 2025 11:59AM

అమెరికాలోని లాస్‌ఏంజెలెస్, కాలిఫోర్నియా ప్రాంతాలను కార్చిచ్చు కాల్చేస్తున్నది. దక్షిణ కాలిఫో ర్నియాలోని అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు లాస్ ఏంజిల్స్ నగరానికి విస్తరించాయి. ఈ దావాలనం నివాస ప్రాంతాలకూ వ్యపించడంతో ఐదుగురు ఆహుతయ్యారు. వెయ్యికి పైగా భవంతులు దగ్ధమయ్యాయి. 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బడబాలనం హాలీవుడ్ నటులు, ప్రముఖులు నివాసం ఉండే పసిఫిక్ సాలేడ్స్‌నూ చుట్టుముట్టింది.
7500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా నీటిని పంప్ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో లాస్ ఏంజిలిస్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డిస్నీ, యూనివర్సల్ స్టూడియోస్‌లో షూటింగ్‌లను రద్దు చేశారు. వేగంగా విస్తరిస్తున్న మంటల కారణంగా
అతి వేగంగా వ్యాపించిన మంటల కారణంగా హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రముఖ నటుడు బిల్లీ క్రిస్టల్ కు చెందిన ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యింది. అలాగే మాండీ మూర్, పారిస్ హిల్టన్, కేరీ ఎల్వెస్ వంటి ప్రముఖుల నివాసాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. భారీ ఆస్తినష్టం వాటిల్లింది.


