TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు 

Published on: Sat Sep 28, 2024 10:33AM

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారి అయినట్టు తెలుస్తోంది. హర్ష సాయి తనపై   అత్యాచారం చేసినట్లు  ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పట్నుంచి పరారీలో ఉన్న హర్షసాయి ఫిర్యాదు చేసిన యువతి ఆడియోలను మీడియాకు విడుదల చేస్తూ వస్తున్నాడు. డబ్బు కోసం  బ్లాక్ మెయిల్ చేయడానికే  రేప్ కేసు పెట్టినట్లు హర్ష సాయి అడ్వకేట్ మీడియాకు వెల్లడించారు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆ యువతి వేధింపులు భరించలేకే తన క్లయింట్ అయిన హర్షసాయి  ఆ యువతితో చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నాడని న్యాయవాది వివరించారు. 
హర్షసాయిపై రేప్ కేసు పెట్టడం వెనక కుట్ర కోణం ఉందని చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్దమేనని హర్షసాయి అడ్డకేట్ అంటున్నారు. ఈ నేపథ్యంలో  పోలీసులు హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారి చేసినట్లు తెలుస్తోంది. దేశం విడిచి వెళ్లిపోకుండా ఉండటానికే ఈ నోటీసులు జారీ అయ్యాయి.