TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి కాకాణిపై లుక్ ఔట్ నోటీసులు

Published on: Thu Apr 10, 2025 11:15AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  అలాగే ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ విచారణకు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ఎటువంటి షీల్డ్ ఇవ్వలేమని స్పష్టం చేసింద. ఈ నేపథ్యంలో కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని అంటున్నారు.  

అక్రమ మైనింగ్ కేసులో   పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి  ఇప్పుడు  అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లడమే మార్గం. ఈ నేపథ్యంలోనే పోలీసలుు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో  ఏ4గా ఉన్న మాజీ మంత్రి కాకాణి  వరుసగా మూడు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టారు.

ఈ నేపథ్యంలోనే  కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసుల తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.  హైదరాబాద్‌, నెల్లూరు సహా.. మరికొన్ని ప్రాంతాల్లో కాకాణి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే కాకాణిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు సమాచారం ఇచ్చారు. ఆయన కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.