Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు.. ఇక అరెస్టేనా?
posted on: May 23, 2025 8:57AM

మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల దండకం అందుకునే వారు. అసభ్య పదజాలంతో.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించే వారు. ఒక దశలో కొడాలి నాని అంటే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికే భయపడు తున్నారా అన్నట్లుగా మారిపోయారు. పరాజయం తరువాత ఆయన నియోజకవర్గం ముఖం చూసిన పాపాన పోలేదు. నియోజవర్గం అనేమిటి అసలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కించవచ్చు. అయినా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తాను మారలేదనీ, తనలో ఫైర్ అలాగే ఉందనీ బిల్డప్పులు ఇచ్చేందుకు శతధా ప్రయత్నించడం మాత్రం మానలేదు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారో.. అప్పటి నుంచీ కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెన్నాడుతోంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు. కొంత కాలం కిందట ఛాతి నొప్పితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అయితే కొడాలి నాని హెల్త్ బులిటిన్ను ఆ ముంబై ఆస్పత్రి విడుదల చేయలేదు కానీ, ఆపరేషన్ విజయ వంతమైందనీ, కొడాలి నాని కొలుకుంటున్నారనీ గుడివాడకు చెందిన వైసీపీ నాయకుడొకరు మీడియాకు తెలిపారు. అంతే ఆ తరువాత నుంచి కొడాలి నానికి సంబంధించి ఏ వార్తా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. నాలుగైదు రోజుల కిందట మాత్రం కొడాలి నాని ముంబై నుంచి తిరిగి వచ్చారనీ, హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారనీ వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిర్దారణ కాలేదు.
అయితే కేసుల భయంతో వణికిపోతున్న కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన పట్ల ఎక్కడా సానుభూతి వ్యక్తం అవుతున్నదాఖలాలు లేవు. చివరికి పార్టీ అధినేత జగన్ కూడా కొడాలి నానిని పరామర్శించలేదు. అనారోగ్యం అన్నంత మాత్రాన కేసులు వదిలిపెట్టవన్న సంగతి అర్ధమైన కొడాలి నాని తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా అరెస్టు తప్పదన్న భయంతో నాని విశ్రాంతి పేరుతో విదేశాలకు చెక్కేయాలని భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది. అయితే ఇప్పుడు కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన తరువాత ఆయన ఎక్కడున్నారు? ఇప్పటికే విదేశాలకు చెక్కేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా కొడాలి నాని కేసుల విషయంలో దర్యాప్తు వేగం పుంజుకుందనీ, ఆయన అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారనీ తాజాగా జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ద్వారా తెలుస్తోంది.


.webp)



