TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెల్లి  ప్రేమ‌... 434 మీ. ఉత్త‌రం!

Published on: Sat Jul 9, 2022 3:18PM

ఇవాళ బ‌డికి వెళుతున్నావా.. ఓ ఒక‌టోత‌ర‌గ‌తి పాప ప‌దో త‌ర‌గ‌తి అన్న‌ను అడిగింది. ఓ ఇంట‌ర్ అమ్మాయి వాళ్ల‌న్న‌ను కాలేజీ డుమ్మానేరా.. అని అడిగింది మెల్ల‌గా!  చిన్న‌పిల్ల‌లు క్లాస్‌రూమ్‌లో స‌ర‌దాగా చీట్లు రాసు కోవ‌డం ఓ ఆట‌! అన్నా చెల్లెళ్లు పెద్ద‌య్యాక వేరు ప్రాంతాల్లో వుంటే ఫోన్ మెసేజ్ ఇచ్చుకుంటు న్నా రు. కానీ కేర‌ళ‌కు చెందిన కృష్ణ‌ప్రియ మాత్రం వాళ్ల‌న్న‌కు  ఏకంగా 434 మీట‌ర్ల వుత్త‌ర‌మే రాసేసింది! ఎంత ప్రేమో అంత‌కుమించిన ఓపిక‌! ఇదే సినిమాల్లో అయితే పూర్వం అన్న‌య్య సన్నిధి.. అంటూ హీరోయిన్ పాడేసేది.. ఓ అన్నా నీ అనురాగం.. అంటో మ‌రో పాటా అందుకునేది. కానీ కృష్ణ‌ప్రియ మాత్రం అదృష్ట వ‌శాత్తూ పాట అందుకోలేదు!

కేర‌ళ  ఇడుక్కి కి చెందిన కృష్ణ‌ప్రియ అంత‌పెద్ద వుత్త‌రం రాయ‌డానికి కార‌ణం ఆమె అన్ననుంచి కొన్ని గంట‌ల‌సేపు ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డం. మే 25న  బ్ర‌ద‌ర్స్ డే రోజు అన్న‌ద‌మ్ములు, అన్నా చెల్లె ళ్లు.. ప‌ని గ‌ట్టుకుని ప‌ల‌క‌రించుకోవ‌డం, శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం ఓ ప‌రిపాటిగా వుంది. అందులోనూ ఈ కేర‌ళ కుట్టి మ‌రీ సీరియ‌స్‌గా పాటిస్తుంది. వాళ్ల‌న్న పేరు కృష్ణ‌ప్ర‌సాద్‌. అత‌ను త‌న చెల్లికి ఫోన్‌లో విషెస్ పెట్టాడు. రెండు మూడు సార్లు పెట్టాడు. అయినా ఆమె నుంచి స‌మాధానం లేదు, మేజేజ్ కూడా లేదు. మ‌రో గంట చూసి కాస్తంత నిజ్జంగానే బాధ‌ప‌డ్డాడు. అంతే వాట్సప్‌లో చెల్లిని తొల‌గించేసేడు. డిలెట్ కొట్ట‌డంలోనూ ఎంతో బాధ‌ప‌డే వుండ‌వ‌చ్చు. కానీ ఓ క్ష‌ణం త‌న చెల్లి కూడా కాస్తంత బిజీగా వుండి చూసుకో లేదేమో అన్న ఆలోచ‌నా చేయ‌లేదు. ఎనీవే.. అలా జ‌రిగిపోయింది. 

కృష్ణ ఆ త‌ర్వాత ఎప్పుడో చూసుకుంది. అయ్యో మ‌ర్చిపోయానే అనుకుంది. అన్న పంపిన మెసేజ్‌లు, స్క్రీన్ షాట్ లూ చూసుకుంది. ప్ర‌తీ ఏడూ మే 25న త‌ప్ప‌కుండా ఉద‌యాన్నే విషెస్ పెట్ట‌డం ఎన్న‌డూ మాన‌లేదామె. ఈసారి బాగా బిజీగా వుండి ర‌వ్వంత మ‌ర‌పు వ‌చ్చింది. కానీ అన్న వాట్స‌ప్ నుంచి త‌న పేరును డిలెట్ చేశాడు. మ‌ళ్లీ ఫోన్ చేయ‌లేదు. ఇది ఆమెను మ‌రింత బాధ‌పెట్టింది. మీకూ, నాకూ ఇది చిన్న‌విష‌య‌మే..కానీ అది వారి మ‌ధ్య ఎంతో పెద్ద విష‌యం. 

చిత్ర‌మేమంటే, కృష్ణ కోప‌గించుకోలేదు. అన్న‌ను ఆనంద‌ప‌ర‌చ‌డానికి వెంట‌నే చిత్ర‌మైన ఆలోచ‌న చేసిం ది. మ‌న‌మైతే పెద్ద చాక్లెట్‌, ఇష్ట‌మైన పుస్త‌క‌మో పంపుతాం. కాకుంటే డ్ర‌స్‌. ఆమె మాత్రం ఊహించ‌ని విధంగా ఓ పెద్ద వుత్త‌రమే రాసేసింది. పెద్ద బుక్‌స్టాల్‌కి వెళ్లి 15 రోల్స్ తెల్ల‌కాయితం తెచ్చుకుంది. చూసిన వారు ఈ పిల్ల‌కి దీంతో ప‌నేమిట‌నుకున్నారు. క‌ద‌ల‌కుండా ఏకంగా 12గంట‌లు కూచుని తీరిగ్గా ఓ పేద్ద వుత్త‌రం రాసింది. ఏం రాసి వుంటుందా అనా.. కోప‌గించుకుంటే ఎలారా.. మ‌నం మ‌నం ఒక‌టిరా..అని పాత సినిమాల్లో రుష్యేంద్ర‌మ‌ణిలా అనుకోలేదు.  చాలా స‌ర‌దా క‌బుర్లే రాసింద‌ట‌.!