TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా ఉగ్రదాడి... ఇండియన్స్ సేఫ్..

Published on: Thu Mar 23, 2017 10:32AM

 

బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా గత రాత్రి ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే.  లండన్‌ లోని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ పై పాదచారులపైకి కారుతో దూసుకెళ్లిన ఉగ్రవాది పార్లమెంటు భవనంలోకి చొరబడే ప్రయత్నం చేసి, భద్రతాధికారిని హతమార్చాడు. ఇంకా దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు ఈదాడిలో భారతీయలెవరూ గాయపడలేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. తాను 'లండన్‌లోని భారత హైకమిషన్‌తో నేను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. లండన్‌ దాడుల్లో భారతీయులు ఎవరూ గాయపడలేదని ఇప్పటివరకు అందిన నివేదికలను బట్టి తెలుస్తున్నది' అని సుష్మా ట్వీట్‌ చేశారు. కాగా బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.