మరో సంచలనం రేపిన వికీలీక్స్
Published on: Tue Feb 28, 2012 1:24PM
లండన్
: వికీలీక్స్ మరో సంచలనానికి తెరలేపింది. అమెరికాకు చెందిన స్ట్రాట్‌ఫర్ అనే సంస్థ భోపాల్ ఉద్యమకారులపై గూఢచారం చేసిందని తెలిపే మెయిల్స్‌ను బయటపెట్టింది. భోపాల్ దుర్ఘటనకు బాధ్యురాలైన డౌ కెమికల్స్ అభ్యర్థన మేరకే ఈ గూఢచారం జరిగిందని వికీలీక్స్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన 50 లక్షల ఈ మెయిల్స్‌ను వికీలీక్స్ ప్రచురించడం మొదలుపెట్టింది. స్ట్రాట్‌ఫర్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సంస్థలు, దౌత్య సిబ్బంది ఇన్‌ఫార్మర్లుగా ఉన్నారని ప్రకటించిన వికీలీక్స్ సంచలనానికి తెర తీసింది.


