మోడీ నోట ఎన్టీఆర్ మాట...

 

ఎప్పుడూ లేనిది ప్రధాని మోడీ తన ప్రసంగంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ గత మూడు రోజులుగా పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈరోజు కూడా సభలో ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తపరిచారు. అంతేకాదు ప్రధాని మోడీ ప్రసంగం మొదలు పెట్టిన కూడా ఎంపీలు మాత్రం తగ్గలేదు. అయితే మోడీ మాత్రం ఎంపీల నినాదాలు చేస్తున్నా తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఇక తన ప్రసంగంలో మోడీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఇక్కడే  మోడీ చాలా తెలివిగా వ్యవహరించారు. కాంగ్రెస్ ను తిడుతూ.. ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. దీనికోసమే తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ సినిమాలు వదిలి రాజకీయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వల్లే ఎన్టీఆర్ పార్టీని పెట్టారని... కాంగ్రెస్ మీద కోపంతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చిన మోడీ... ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మ గౌరవం అంటూ డైలాగ్స్ కొట్టారు కానీ..ఏపీకి ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు...