వచ్చే నెల 9 వరకూ లోక్ సభ వాయిదా
Published on: Fri Feb 13, 2026 1:17PM
.webp)
లోక్ సభ వాయిదా పడింది. వచ్చే నెల 9 వరకూ లోక్ సభను వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు శుక్రవారం (ఫిబ్రవరి 13) లోక్ సభలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాల నిరసన తెలిపారు.
విపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. జెఫ్రీ ఎప్టోన్తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంబంధాలపై వివరణ కోరుతూ ప్రతిపక్షాలు సభను స్తంభింప చేశారు. ఇలా ఉండగా సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నోటీసు ఇవ్వడం కూడా సభలో గందరగోళానికి దారి తీసింది. ఈ పరిస్థితుల్లో సభను వచ్చే నెల 9 వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా ప్రకటించారు.


