TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోక్ సభ రేపటికి వాయిదా

Published on: Mon Jul 7, 2014 3:19PM

 

లోక్‌సభ సమావేశాలు మంగళవారం ఉదయానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ సమావేశం కొనసాగుతోంది. లోక్‌సభలో విపక్షాలు ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ఆందోళన చేపట్టాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెంకయ్యనాయుడు సభకు తెలిపారు. అయినా పలువురు సభ్యులు తమతమ స్థానాల్లో ఉండి నినాదాలు చేయడంతో సభాకార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఓటింగ్‌ లేకుండా ధరల పెరుగుదలపై చర్చ చేపట్టవద్దంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమావేశం కొనసాగించడానికి సహకరించకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.