TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోక్పాల్ బిల్లుపై సవరణలకు లోక్సభ ఆమోదం

Published on: Tue Dec 27, 2011 10:17PM

న్యూఢిల్లీ: లోక్పాల్ బిల్లుకు సవరణలను లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లుపై లోక్సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ ముగిసిన తరువాత బిల్లుపై ఓటింగ్కు స్పీకర్ మీరాకుమార్ అనుమతించారు. మూజువాణి ఓటింగ్తో పది సవరణలను ఆమోదించారు. బిజెపి పక్ష నేత సుష్మాస్వరాజ్ సవరణలను సభ తోసిపుచ్చింది. ఎస్పి, బిఎస్సి సభ్యులు ఓటింగ్ నుంచి వాకౌట్ చేశారు.