TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోక్‌సభలో ఆహార బిల్లు తర్వాత లోక్‌పాల్ బిల్లు

Published on: Thu Dec 22, 2011 11:35AM

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఆహార బిల్లును ప్రవేశపెట్టింది. ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్ ప్రారంభమైంది. 317 పాయింట్లకు ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. అలాగే లోక్‌పాల్ బిల్లును కూడా కేంద్రం గురువారమే ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తయారు చేసిన లోక్‌పాల్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌పాల్ బిల్లుపై చర్చించేందుకు స్పీకర్ 6 గంటలు అనుమతిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా లోక్‌పాల్ బిల్లును గురువారం ప్రవేశపెట్టి  క్రిస్మస్ సందర్భంగా నాలుగు రోజుల తర్వాత చర్చ జరుగనుంది. అయితే కోరల్లేని ఈ బిల్లును అంగీకరించేది లేదని అన్నాతో పాటు బీజేపీ మండిపడుతోంది. జన్‌లోక్‌పాల్ బిల్లు వచ్చేంతవరకు తన ఉద్యమం ఆగదని అన్నా ప్రకటించారు.