లోక్‌పాల్‌బిల్లు బ్లూ ప్రింట్ రెడీ
Published on: Mon Dec 19, 2011 4:17PM
న్యూఢిల్లీ
: లోక్‌పాల్ బిల్లు బ్లూ ప్రింట్ రెడీ అయింది. తొమ్మింది మంది సభ్యులుగా ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లోక్‌పాల్‌లో రిజర్వేషన్లు కలిపిస్తారు. ఆయా రంగాలలోని నిజాయితీపరులైన ప్రముఖులను ఈ బిల్లులో నియమిస్తారు. అవినీతి కేసుల విచారణ ఈ బిల్లు పరిధిలోనే ఉంటుంది.అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులను విచారించే హక్కును చట్టబద్దంగా కలిపిస్తారు. విచారణ కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారు. సెల్లో పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు. భారీ అవినీతి కుంభకోణాలపై లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ విచారణ చేస్తుంది. అయితే సీబీఐకి లోక్‌పాల్ బాస్‌గా ఉండదు. రాష్ట్రాల్లో లోకాయుక్త, లోక్‌పాల్ పరిధిలోనే ప్రధాని ఉంటారు. సీ, డీ గ్రేడ్ అధికారులు బిల్లు పరిధిలోకి వస్తారు. పదవిలో ఉన్నప్పుడు ప్రధానిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పదవీవిరమణ అనంతరం విచారణ చేయాల్సి ఉంటుంది. శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతారు.


