కొండను తవ్వి లోక్‌పాల్‌ పట్టారా?

 

బోలెడంత హంగామా చేసి, మిన్నునూ మన్నునూ ఏకం చేసినంత పని చేసి చివరికి లోక్‌పాల్‌ను సాధించారు. అంతా అయ్యాక.. ఇప్పుడు సాధించిన వారే అంటున్న మాటలు వింటుంటే.. సగటు జీవికి పై విధంగా సందేహం కలగడంలో ఆశ్యర్యం లేదు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు స్పందించిన తీరు చూండండి మరి..


లోక్‌పాల్‌ సాధనలో కర్త కర్మ క్రియ అయిన అన్నా హజారే దీక్ష విరమణ అనంతరం ఏమన్నారంటే. 'లోక్‌పాల్‌ సభ ఆమోదం పొందడం హర్షణీయం.. అయితే దీనితో అంతా అయిపోతుందనుకోలేం. అవినీతి వ్యతిరేఖపోరాటంలో ఇదో ముందడుగు మాత్రమే'ఈ బిల్లు రావాల్సిదేనని కాంగ్రెస్‌ తరపున గట్టిగా పట్టుపట్టి హజారేతో సైతం శభాష్‌ అనిపించుకున్న రాహుల్‌గాంధీ ఏమన్నారంటే.. ' లోక్‌పాల్‌ ఆమోదం పొందడం పట్ల సంతోషంగా ఉంది. అయితే లోక్‌పాల్‌తో మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి చట్టాలు మరిన్నిరావాలి'
ఆది నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్న ఆమ్‌ఆద్మీనేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏమన్నారంటే.. 'ఈ బిల్లులో అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన చట్టంపై స్పష్టత లేదు, బిల్లు విషయంలో కాంగ్రెస్‌ అన్నాహజారేనే తప్పు దారి పట్టించింది'.]

 


అవినీతి పోరాటంలో అన్నాహజారేకు పూర్తి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు ఏమాన్నారంటే.. ' లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం వెనుక అన్నాహజారే కృషి వెలకట్టలేనిది. ఈ బిల్లును మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం జరగాలి'.


నేరమయరాజకీయాలకు వ్యతిరేకంగా ఆంద్రప్రదేశ్‌లో లోక్‌సత్తాను ఏర్పాటుచేసిన జయప్రకాష్‌ నారాయణ్‌ ఏమన్నారంటే.. ' ఈ బిల్లు రాజకీయలబ్థి కోసం మాత్రమే. కేవలం 2 వేల మందికి పరిమితమైన దీని ద్వారా సాధించేదేమి లేదు'.