లోక్పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదు : ములాయం
Published on: Wed Dec 28, 2011 9:52AM
న్యూ ఢిల్లీ
: లోక్పాల్ బిల్లుతో దేశంలోని అవినీతికి అడ్డుకట్ట వేయలేమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో లోక్పాల్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదని, పార్లమెంటు మాత్రమే ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందన్నారు.ఈ దేశంలో పార్లమెంటు వ్యవస్థ కంటే మరేదీ ఎక్కువ కాదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో అనేక లోపాలు ఉన్నాయన్నారు. అనేక కీలకాంశాలను అది పట్టించుకోలేదని చెప్పారు. ప్రజాస్వామ్యం లోక్పాల్ కన్నా పెద్దదన్నారు. తమను ప్రజలు ఎన్నుకున్నారని, అందువల్ల ఆ ప్రజలకే ఎంపీలు భయపడతారన్నారు.


