TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హజారే దీక్ష: లోక్పాల్ బిల్లుఫై టెన్షన్ టెన్షన్

Published on: Tue Dec 27, 2011 9:35AM

న్యూ ఢిల్లీ: పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోసం ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. మరోపైపు కేంద్రం రూపొందించిన లోక్పాల్ బిల్లుపై పార్లమెంట్‌లో వాడివేడిగా చర్చ జరుగనుంది.అన్నా దీక్ష దేశ వాణిజ్య రాజధాని ముంబైలో సాగుతుండగా, లోక్పాల్ బిల్లుపై చర్చ ఢిల్లీలో జరుగనుంది. దీంతో దేశ ప్రజల దృష్టంతా వాణిజ్య, రాజకీయ రాజధానులైన ముంబై, హస్తినలపై కేంద్రీకృతమైంది. అన్నా హజారే డిమాండ్‌కు తలొగ్గి కేంద్రం పటిష్టమైన లోక్పాల్‌ను ఆమోదిస్తుందా లేక ప్రభుత్వం తెచ్చిన కోరలు లేని బిల్లే లోక్‌సభలో ఆమోదిస్తారా అన్నది ఇపుడు ధర్మ సందేహంగా మారింది.

కాగా, జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, బలహీన లోక్పాల్‌కు వ్యతిరేకంగా నిరశన దీక్షకు దిగుతానని హజారే సోమవారం పునరుద్ఘాటించారు. ఆయన ముంబైలోని ఎంఎంఆర్డీఏ మైదానంలో మంగళవారం ఉదయం 11 గంటలకు దీక్షకు ఆశీనులు కానున్నారు.జుహూలోని గాంధీ విగ్రహానికి  నివాళి అర్పించి, అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఆయన దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. అన్నా దీక్షకు దాదాపు 50 వేల మంది హాజరవుతారని టీమ్ అన్నా భావిస్తోంది.