డిమాండ్లకు ఓకే అంటే జైల్భరోస్టాప్:అన్నా బృందం
Published on: Tue Dec 27, 2011 9:28AM
న్యూ ఢిల్
లీ: కేంద్రం ప్రతిపాదించిన లోక్పాల్ బిల్లులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో పాటు తాము చేసిన నాలుగు ప్రధానమైన డిమాండ్లపై ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నా బృందం పునరుద్ఘాటించింది. దీనిపై టీమ్ అన్నా సభ్యుడు ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే జైల్భరో కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటామన్నారు.బైలో అన్నా దీక్షకు మద్దతుగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో మూడు రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టనున్నారు. కాగా, లోక్పాల్ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగేవరకు వేచిచూడాలని, అప్పటిదాకా దీక్ష నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని అన్నా హజారేకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఇదిలావుండగా, అన్నా దీక్ష కోసం మహారాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అన్నా దీక్షకు కూర్చోనున్న ఎంఎంఆర్డీఏ మైదానంలో రెండు వేల మంది కానిస్టేబుళ్లను, 200 మంది సబ్ ఇన్స్పెక్టర్లను రంగంలోకి దించింది. దాడులు, పేలుళ్లు జరిగే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారీగా బందోబస్తు కల్పించారు.


