TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దీక్షకు ఆటంకం కలిగించడం ఫై అన్నా ఫైర్

Published on: Fri Dec 23, 2011 11:49AM

రాలేగావ్ సిద్ధి: పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే  దీక్షకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించడంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు.ఈ నెల 27వ తేదీ నుంచి తాను తలపెట్టిన నిరసన దీక్షకు వేదికను ఇవ్వకపోతే జైల్లోనే దీక్ష చేస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు.తాను ఆగస్టు 16వ తేదీ ఢిల్లీలో దీక్ష చేయాలనుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే చేసిందని చివరకు తాము జైలుకు వెళ్లి అక్కడే దీక్ష చేయడంతో స్థలం కేటాయించారని, ఈసారి కూడా అదే జరుగుతుందని ఆయన అన్నారు.

నిజానికి అన్నా హజారే ఢిల్లీలో దీక్ష చేయాలని భావించారు. ఎముకలు కొరికే చలి వల్ల తన దీక్షను ముంబైకి మార్చుకున్నారు. ముంబైలో వేదిక ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఆజాద్ మైదాన్‌లో దీక్షకు కూర్చోవాలనే అన్నా హజరేకు మహారాష్ట్ర క్రీడా శాఖ అభ్యంతరం చెప్పింది. మైదానం చెడిపోతుందని శాఖ తెలిపింది. హజారే ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు జైల్ భరో కార్యక్రమాన్ని తలపెట్టారు. జైల్ భరో కార్యక్రమానికి అన్నా టీమ్ రిజిష్టర్ చేసుకుంది.