లోక్‌పాల్ ఫై లాలూ,కేజ్రీల వ్యాఖ్యలు
Published on: Thu Dec 22, 2011 3:44PM
ఘజి
యాబాద్ : సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకరాకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నా బృందం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లు ప్రజల హక్కులను కాలరాసేలా ఉందని అయన పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లు ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మ వంటిదని ఆయన విమర్శించారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లుకోసం ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా లోక్‌పాల్‌లో రిజర్వేషన్ అంశాన్ని లాలూ ప్రసాద్‌యాదవ్ సమర్థించారు. మైనార్టీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదని, రిజర్వేషన్ నిర్ణయం సరైనదేనని ఆయన పేర్కొన్నారు. నలుగరు, ఐదుగురు కలిసి ఎంపీలను, పార్లమెంట్‌ను శాసించడం సరికాదన్నారు. ఇది అత్యంత సమర్ధవంతమైన లోక్‌పాల్ బిల్లు కాదని, దీన్ని ఆమోదించవద్దని ఆయన తెలిపారు. ప్రధాని దేశ నాయకుడని, ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకరావద్దని, సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి కూడా తేవద్దన్నారు. లోక్‌పాల్ సభ్యులందరూ నిజాయితీపరులే అయి ఉంటారని నమ్మకమేమిటని ఆయన ప్రశ్నించారు.


