లోపాలేమిటో చెప్తా: హజారే
Published on: Thu Dec 22, 2011 1:59PM
న్యూఢిల్
లీ: కేంద్రం వట్టి పనికిమాలిన లోక్పాల్ బిల్లును తీసుకు వస్తోందని అన్నా హజారే ధ్వజమెత్తారు.పార్లమెంటులో ప్రస్తుతం యూపీఎ ప్రవేశపెడుతున్న లోక్పాల్ బిల్లు వల్ల అవినీతిని అణుమాత్రం కూడా నిలువరించలేమని అన్నారు. రాలెగాన్ సిద్ధిలో ఆయన మాట్లాడుతూ మీరు ప్రవేశపెట్టబోయే లోక్పాల్ బిల్లు ఎంతటి బలమైందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సీబీఐను లోక్పాల్ పరిధిలోకి తీసుక రాకపోతే అవినీతికి అడ్డుకట్ట అసాధ్యమన్నారు. కిందిస్థాయి ఉద్యోగులను కూడా లోక్పాల్ పరిధిలో లేకుండా చేశారని దుయ్యబట్టారు.
ఐతే సోనియా గాంధీ మాత్రం తాము తెస్తున్న లోక్పాల్ బిల్లు మహా పటిష్టమైనదని అంటున్నారనీ, అదే నిజమైతే ఆ బిల్లును ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా బహిరంగంగా బిల్లును బయట పెట్టినప్పుడు అందులో ఉన్న లోపాలేమిటో అది ఎందుకు పనికిమాలిన బిల్లో వివరించి చెపుతానన్నారు హజారే.


