లోక్‌పాల్‌పై గందరగోళం సభ 12 గంటలకు వాయిదా
Published on: Wed Dec 21, 2011 10:57AM
ఢిల్లీ: లో
క్‌పాల్ బిల్లుపై చర్చకు అనుమతించాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది.ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. లోక్‌పాల్‌పై చర్చకు జీరో అవర్‌లో సమయం కేటాయిస్తానని స్పీకర్ మీరాకుమార్ ఎంత చెప్పినా ప్రతిపక్షాలు పోడియం ముందు నిరసన వ్యక్తం చశారు.పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించాలని స్పీకర్ ప్రతిపక్షాలను కోరారు.దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేస్తున్నారని మీరాకుమార్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఎంత చెప్పినా ప్రతిపక్షాలు పట్టువీడకపోవడంతో సభను 12 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేయటంతో మీరాకుమర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.


