అబ్దుల్ కలామ్‌కి లోకేష్ నివాళి!
Published on: Tue Oct 15, 2024 12:27PM

మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. ‘‘మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. దేశం కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం జీవితాంతం శ్రమించిన మహనీయుడు కలాం. విద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఎనలేని సేవలందించిన కలాం చిరస్మరణీయులు’’ అని నారా లోకేష్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.


