సీఎం జగన్ మాటలు నిజం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!!

 

 

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై దాడి చేసాడని మీడియాలో వార్తలు రావడం ఆ తరువాత దీని పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా దీనిపై మాజీ మంత్రి,  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇదే శాసనసభ్యుడు అసెంబ్లీలో చంద్రబాబు గారిని 'ఖబడ్దార్' అన్నప్పుడు సీఎం జగన్ ముసిముసిగా నవ్వుకున్నారని, ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక అవస్థలు పడుతుంటే చూడడం తమకూ బాధగానే ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా  వైసీపీ సంస్కృతే అలాంటిదని, మద్యం మానవ సంబంధాలను మంటగలుపుతుందని సీఎం జగన్ గారు అన్న మాటలను ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారని వ్యాఖ్యానించారు. మందుకొట్టి ఓ జర్నలిస్ట్ ఇంటికి వెళ్లడమే కాకుండా అతడిని చంపుతానని బెదిరించి, "జగన్ కూడా నన్నేమీ చేయలేడు" అంటూ వైసీపీ అధినేత పరువు కూడా తీశాడని లోకేశ్ విమర్శించారు.