TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కల్యాణ్ తో లోకేష్ భేటీ

Published on: Wed Feb 11, 2026 9:41AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ పేషీలో జరిగిన ఈ భేటీలో ఇరువురూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించారు.

తన పేషీకి వచ్చిన మంత్రి నారా లోకేష్ ను పవన్ కల్యాణ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు.  లోకేష్ తో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు.