TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అపురూపమైన కానుక.. నేతన్నల బహుమతికి మురిసిపోయిన లోకేష్

Published on: Thu Feb 27, 2025 11:39AM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు మంగళగిరికి చెందిన చేనేత కళాకారుడు. మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి. ఇక్కడి చేనేత కళాకారులు ఎన్నో కొత్త కళాకృతులను ఆవిష్కరించారు.  ఆవిష్కరిస్తున్నారు.  తాజాగా మంగళగిరికి చెందిన జంజనం మల్లేశ్వరరావు అనే చేనేతకారుడు తన కుమారుడు కార్తికేయులుతో కలిసి తమ అభిమాన నాయకుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు.  

స్వతహాగా తెలుగుదేశం అభిమానులైన వీరు లోకేష్ కుటుంబం మొత్తాన్ని చేనేత వస్త్రంపై చిత్రీక రించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి, వారి కుమారుడు నారా దేవాన్ష్ చిత్రాలను నేతవస్త్రంపై దించేశారు.  తాము నేసిన ఈ వస్త్రాన్ని జంజనం మల్లేశ్వరరావు, కార్తికేయులు బుధవారం (ఫిబ్రవరి 26)న లోకేష్ కు బహూకరించారు.  

అద్భుత నైపుణ్యంతో వారు నేసిన ఆ వస్త్రాన్ని… దానిపై తన   కుటుంబ సభ్యులను అచ్చుగుద్దినట్లు నేసిన వారి నైపుణ్యాన్ని లోకేష్ ప్రశంసించారు.  వారికి కృతజ్ణతలు తెలిపారు. ఇప్పుడు ఆ వస్త్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.