TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే..

Published on: Mon Nov 22, 2021 4:23PM

మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గబోమంటూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని.. ఘాటుగా విమ‌ర్శించారు. ఈ మేర‌కు జ‌గ‌న్‌రెడ్డి గ‌తంలో అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌ల వీడియోను జ‌త చేస్తూ ట్వీట్ చేశారు. 

తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని. అంటూ ట్వీట్ చేశారు నారా లోకేశ్‌.