TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయోత్సవ సభకు లోకేష్ దూరం.. ఎందుకంటే?

Published on: Wed Sep 10, 2025 9:34AM

అనంతపురం వేదికగా ఈ రోజు జరగనున్న సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయోత్సవ సభకు మంత్రి నారా లోకేష్ హాజరు కావడం లేదు. ఆఖరి నిముషంలో ఆయన తన అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. ఇంతకీ ఆయన పర్యటన రద్దు చేసుకోవడానికి కారణమేంటంటే.. నేపాల్ లో  నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో  అక్కడ ఉన్న తెలుగువారిని  సురక్షితంగా రాష్ట్రానికి రప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ఆదేశించడంతో నేడు అనంతపురం లో జరుగనున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాకి లోకేష్ హాజరుకావడం లేదు.

తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని వెలగపూడి సచివాలయం లోని రియల్ టైమ్.గవర్నెన్స్ సెంటర లోపరిస్థితులను సమీక్షిస్తున్నారు.  ఉదయం పది గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు చేరుకున్న నారా లోకేష్ అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని  సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

 ఈ మేరకు సంబంధిత అధికారులంతా వెంటనే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తారు.   నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి   మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు.